మెగా హీరో సాయిధరమ్ తేజ్, మేనేజర్ సతీష్ ఇద్దరూ మంచి స్నేహితులు. హీరో, మేనేజర్ అన్నట్టుగా కాకుండా ఫ్రెండ్స్ లా ఉంటారు. ఇండస్ట్రీ జనాలకు అందరికీ తెలిసిందే. తేజ్ సినిమా వ్యవహరాలు, పబ్లిసిటీ అంతా ఆయనే చూసుకుంటాడు. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఇద్దరి మధ్య గొడవ జరిగిందట. అది కూడా బ్రో సినిమా షూటింగ్ స్పాట్ లో జరిగిందని తెలిసింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అసలు ఇది నిజమా అని వీరిద్దరి గురించి తెలిసిన వాళ్లు నమ్మలేకపోతున్నారు.
అసలు ఎవరీ సతీష్ అనుకుంటున్నారా..? మెగా ఫ్యాన్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్న సతీష్ ను తేజ్ తనతో ఉండమని.. తన వ్యవహరాలు చూసుకోమని చెప్పడంతో కాదనలేక ఉద్యోగం వదిలేసి వచ్చేసాడు. తేజ్ కి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి అంటిపెట్టుకునే ఉన్నారు. తేజ్ సినిమాలకు సంబంధించి ప్లానింగ్, పబ్లిసిటీ అంతా దగ్గరుండి చూసుకునేవాడు. విరూపాక్ష సినిమాను వైజాగ్ ఏరియాలో తనే డిస్ట్రిబ్యూట్ చేశాడు. అయితే.. అసలు వీళ్లిద్దరి మధ్య గొడవ జరగడానికి కారణం ఏంటి అనేది తెలియాల్సివుంది. ఇది తెలిసినవాళ్లు అసలు ఏమైందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతలా గొడవపడేలా ఏం జరిగిందో…?