“ఫియర్” టీజర్ రివ్యూ – గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న “ఫియర్” సినిమా టీజర్ పాన్ ఇండియా స్థాయిలో ఈ రోజు రిలీజ్ అయ్యింది. “ఫియర్” సినిమా తెలుగు టీజర్ ను స్టార్ హీరో రానా, తమిళ టీజర్ ను విజయ్ సేతుపతి, కన్నడ టీజర్ ను కిచ్చా సుదీప్, మలయాళ టీజర్ ను దిలీప్, హిందీ టీజర్ ను ఇమ్రాన్ హశ్మీ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. దర్శకురాలు డా. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. 34 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో 60కి పైగా అవార్డ్స్ గెల్చుకుంది “ఫియర్” సినిమా. మరి ఈ మూవీ టీజర్ ఎలా ఉందో చూస్తే..

చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సింధు, సంపత్. వారి స్నేహం ప్రేమగా మారుతుంది. సంపత్, సింధుది క్యూట్ లవ్ స్టోరీ. ఆఫీస్ వర్క్ కోసం వారం రోజులు క్యాంప్ కు వెళ్లిన సంపత్ నుంచి ఫోన్ కాల్ రాదు. దీంతో భయపడిన సింధు తల్లిదండ్రులకు, స్నేహితులకు, తెలిసిన సన్నిహితులకు చెప్పుకుంటుంది. చివరకు పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. చిన్నప్పటి నుంచి భయపడే స్వభావం ఉన్న సింధు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది. ఆమె సైకలాజికల్ సిట్యువేషన్ ఏంటి. కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్లిన సింధును పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అనే అంశాలతో టీజర్ ఆసక్తికరంగా సాగింది. ఫియర్ టీజర్ లో వేదిక పర్ ఫార్మెన్స్, సినిమాటోగ్రఫీ, బీజీఎం, అనీష్ కురువిల్లా, జయప్రకాష్, షాయాజీ షిండే వంటి స్టార్ కాస్టింగ్ ఆ పాత్రలకు మరింత ఎఫెక్టివ్ నెస్ తీసుకొచ్చారు.