మెగా బ్రదర్స్.. చిరంజీవి, పవన్ కళ్యాణ్.. వీరిద్దరి సినిమాలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. చిరంజీవి విశ్వంభర సినిమా చేస్తుంటే.. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు అనుకున్న డేట్ కు రావడం లేదు. దీంతో విశ్వంభర, వీరమల్లు సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు అనేది ఆసక్తిగా మారింది. విశ్వంభర సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. గేమ్ ఛేంజర్ వలన పోస్ట్ పోన్ చేశారు. గేమ్ ఛేంజర్ అనే అడ్డంకి లేకపోతే విశ్వంభర సంక్రాంతికి వచ్చేది. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. కొంత టాకీ, ఓ సాంగ్ బ్యాలెన్స్ ఉందని సమాచారం. త్వరలోనే చిరు విశ్వంభర షూట్ లో జాయిన్ కానున్నారు. మరి.. ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే.. మే 9న విశ్వంభర చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇక మార్చి 28న వీరమల్లు రిలీజ్ అని ప్రకటించారు. ఇటీవల ఈ మూవీ నుంచి పవన్ కళ్యాణ్ పాడిన మాట వినాలి.. అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాట విశేషంగా ఆకట్టుకుని యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతోంది. అయితే ఎప్పటి నుంచో షూటింగ్ స్టేజ్ లోనే ఉన్న వీరమల్లు మార్చి 28న వస్తుంది అనుకుంటే.. ఇప్పుడు ఆ డేట్ కి నితిన్ రాబిన్ హుడ్ రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. వీరమల్లు వస్తే.. నితిన్ రాబిన్ హుడ్ రాదు. వీరమల్లు రావడం లేదు కాబట్టే.. రాబిన్ హుడ్ ని రంగంలోకి దింపుతున్నారని టాక్. అయితే.. వీరమల్లు వచ్చేది ఎప్పుడు అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.