పవన్ వ్యాఖ్యలపై ఫ్యాన్స్ లో కలవరం

ఎప్పుడో ఒకసారి రెండు మూడు రోజులు సినిమా షూటింగ్ కు కేటాయిస్తాను అంటూ పవన్ కల్యాణ్ (Pawan kalyan ) చేసిన వ్యాఖ్యలతో ఆయన అభిమానుల్లో (Fans) కలవరం ఏర్పడుతోంది. ఎప్పుడో ఒకసారి రెండు మూడు రోజులు షూటింగ్ కు ఇస్తే ఇప్పుడు లైనప్ చేసుకున్న సినిమాలు ఎప్పటికి కంప్లీట్ అవుతాయో అభిమానులకు అర్థం కావడం లేదు. నిర్మాతలకు ఈ విషయమై సారీ చెప్పానని పవన్ అన్నాడు. అంటే నిర్మాతలను ఇప్పటికే ప్రిపేర్ చేశాడన్న మాట.

ఎన్నికల్లో గెలిచి ఏపీ డిఫ్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ జనాల్లో తిరుగుతున్నాడు. వారి సమస్యలు తెలుసుకుంటున్నాడు. ఇలాంటి టైమ్ లో ఉప ముఖ్యమంత్రి పదవిలోని బాధ్యతలు వదిలి సినిమా సెట్ లోకి వస్తే జనాల్లో వ్యతిరేకత వస్తుందని పవన్ భయపడుతున్నాడు. ఆయనకు ఓజీ (OG), హరి హర వీరమల్లు (Hari Hara veeramallu), ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad bhagatsingh) వంటి చిత్రాలున్నాయి.