“కల్కి 2”, “స్పిరిట్” ఎగ్జైటింగ్ అప్డేట్స్

భారీ పాన్ ఇండియా లైనప్ కంటిన్యూ చేస్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన మారుతి డైరెక్షన్ లో ది రాజాసాబ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. దీనితో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ మూవీలో నటిస్తున్నారు ప్రభాస్. ఫౌజీ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ రెడీ చేస్తున్నారు. అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారని టాక్.

స్పిరిట్ విషయానికి వస్తే.. అక్టోబర్ లోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురావాలి అనుకున్నారు. అయితే.. ప్రభాస్ బిజీగా ఉండడం వలన కుదరలేదు. సందీప్ రెడ్డి వంగ గత కొంతకాలంగా స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు రాజాసాబ్ రిలీజ్ తర్వాత సెట్స్ పైకి తీసుకువస్తారనుకుంటే.. కల్కి 2 షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని తెలిసింది. ప్రభాస్, అమితాబ్, కమల్ కాంబోలో రూపుదిద్దుకున్న ఈ క్రేజీ, పాన్ వరల్డ్ మూవీ కల్కి బాహుబలి తరహాలో సంచలన విజయాన్ని అందించింది. దీంతో కల్కి 2 పై మరింత క్రేజ్ పెరిగింది. కల్కి 2 జూన్ నుంచి సెట్స్ పైకి వస్తే..కొంత టాకీ చేసిన తర్వాత స్పిరిట్ ని సెట్స్ పైకి తీసుకురావాలి అనుకుంటున్నారని తెలిసింది. ఇండోనేషియాలో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారని సమాచారం. రాజాసాబ్ రిలీజ్ తర్వాత కల్కి 2, స్పిరిట్ గురించి క్లారిటీ ఇవ్వనున్నారని తెలిసింది.