రవితేజ హీరోగా నటించిన ఈగిల్ సినిమా సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా సంక్రాంతి పోటీ నుంచి తప్పుకుందని ఇటీవల వార్తలొచ్చాయి. ఈగిల్ తో పాటు వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ కూడా సంక్రాంతి రిలీజ్ వద్దనుకుందని టాక్ వినిపించింది.
ఈ రూమర్స్ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పందించింది. ఈగిల్ ను జనవరి 13న సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామంటూ మరోసారి కన్ఫర్మ్ చేసింది. రవితేజ, అనుపమా పరమేశ్వరన్, కావ్య థాపర్ కీ రోల్స్ లో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈగిల్ సినిమాను రూపొందించారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరపైకి రాబోతోందీ సినిమా.