ఆడియెన్స్ రివ్యూస్ పంపిస్తే “డ్రింకర్ సాయి” గ్రాండ్ న్యూ ఇయర్ పార్టీ

“డ్రింకర్ సాయి” చూసి సినిమా ఎలా ఉందో రివ్యూ పంపిన ప్రేక్షకులకు గ్రాండ్ న్యూ ఇయర్ పార్టీ ఇస్తామంటూ ప్రకటించారు మూవీ టీమ్. రివ్యూ పంపిన ఆడియెన్స్ నుంచి విజేతలను ఎంపిక చేసి పార్టీకి ఇన్వైట్ చేస్తామంటూ తెలిపారు. ఈ రోజు “డ్రింకర్ సాయి” సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్ ను సెలబ్రేట్ చేసుకున్నారు మూవీ టీమ్. ఈ కార్యక్రమంలో హీరో ధర్మ, హీరోయిన్ ఐశ్వర్య శర్మ, డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి, నిర్మాతలు బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్, ఇతర టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో

డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి మాట్లాడుతూ – ఈ వీకెండ్ మీరు థియేటర్స్ కు వెళ్లాలనుకుంటే పుష్ప 2 తప్ప మరో సినిమా లేదు. ఒకసారి మా “డ్రింకర్ సాయి” మూవీ చూడండి. నచ్చితే పదిమందికి చెప్పండి. ఫ్యామిలీతో వెళ్లండి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సుదర్శన్ థియేటర్ లో మా సినిమా సెకండ్ డే కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఆడియెన్స్ నుంచే రివ్యూస్ తీసుకోబోతున్నాం. ఈ కాంటెస్ట్ ద్వారా సెలెక్ట్ అయిన వారికి డ్రింకర్ సాయి 31న మంచి పార్టీ ఇస్తాడు. అలాగే ఆడియెన్స్ దగ్గరకు మా మూవీ గురించి చెప్పుకునేందుకు థియేటర్స్ విజిట్ కు వెళ్తున్నాం. “డ్రింకర్ సాయి” మూవీని ప్రతి ఆడియెన్ కు చేర్చాలనేదే మా ప్రయత్నం. అన్నారు.

హీరో ధర్మ మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” మహిళలకు, ఫ్యామిలీస్ కు మూవీ నచ్చడం సంతోషంగా ఉంది. కొందరు ఫస్టాఫ్ బాగుందని, మరికొందరు సెకండాఫ్ బాగుందని అంటున్నారు. ఏరియా వైజ్ గా రెస్పాన్స్ చూస్తే అందరి దగ్గర నుంచీ మూవీ బాగుందనే టాక్ వస్తోంది. మా డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉన్నారంటే అంతకంటే సంతోషం లేదు. మా మూవీని ఆదరిస్తున్న మహిళా ప్రేక్షకుల కోసం టికెట్స్ ను ఉచితంగా ఇవ్వబోతున్నా. అన్నారు.