బాక్సాఫీస్ వద్ద రూ.5.75 కోట్లు రాబట్టిన “డ్రింకర్ సాయి”, ఓటీటీ రాకపై ఏర్పడిన క్రేజ్

థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న మూవీస్ ఓటీటీలో ఎప్పుడు వస్తాయనే క్రేజ్ ఏర్పడుతుంటుంది. ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన డ్రింకర్ సాయి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పట్ల ఇలాంటి క్యూరియాసిటీనే ప్రేక్షకుల్లో కలుగుతోంది. ఓటీటీ ప్లాట్ ఫామ్, స్ట్రీమింగ్ డేట్ ఇప్పటిదాకా మేకర్స్ అనౌన్స్ చేయలేదు. త్వరలోనే ఆ డేట్ ను చెప్పబోతున్నారు. ఈ నెలాఖరులో గానీ, ఫిబ్రవరి తొలి వారంలోనే గానీ “డ్రింకర్ సాయి” సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ వీక్ లో స్ట్రాంగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ షోస్ తో రన్ అవుతోంది. థియేట్రికల్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను మేకర్స్ ప్రకటించనున్నారు.

సూపర్ హిట్ కలెక్షన్స్ తో ఫస్ట్ వీక్ రన్ కంప్లీట్ చేసుకున్న డ్రింకర్ సాయి సినిమా సెకండ్ వీక్ లో బీ, సీ సెంటర్స్ లో మంచి వసూళ్లు సాధిస్తోంది. తొలి 5 రోజులకు 3.11 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కించుకున్న ఈ సినిమా సెకండ్ వీక్ కు 5.75 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టిందని మేకర్స్ తెలిపారు. థియేటర్స్ లో వచ్చిన ఈ ఆదరణతో తమిళం, కన్నడ వంటి ఇతర భాషల్లో డబ్బింగ్ రైట్స్ కోసం డిమాండ్ ఏర్పడుతోంది. అయితే తమిళంలో తామే డ్రింకర్ సాయి మూవీని డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు.