మా మూవీ హార్ట్ టచింగ్ గా ఉంటే 3 రేటింగ్ ఇవ్వండి – రివ్యూయర్స్ కు “డ్రింకర్ సాయి” డైరెక్టర్ రిక్వెస్ట్

ఈరోజు జరిగిన “డ్రింకర్ సాయి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిత్ర దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి. “డ్రింకర్ సాయి” సినిమా మీకు ఏమాత్రం హార్ట్ టచింగ్ గా అనిపించినా 3 రేటింగ్ ఇచ్చి ఎంకరేజ్ చేయాలంటే రివ్యూ రైటర్స్ ను రిక్వెస్ట్ చేశారు. బాగా లేదని మీకు అనిపిస్తే జీరో ఇవ్వండి, కానీ బాగుందని అనిపిస్తే మనస్ఫూర్తిగా మీ ప్రోత్సాహం అందించండి అంటూ కోరారు. రివ్యూస్, రివ్యూ రైటర్స్ పై తనకు గౌరవం ఉందని కిరణ్ తిరుమలశెట్టి చెప్పారు. “డ్రింకర్ సాయి” సినిమాను జెన్యూన్ గా తెరకెక్కించామని, ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి ఎమోషనల్ కంటెంట్ సినిమాలో చూస్తారని ఆయన అన్నారు. సినిమా చివరి 40 నిమిషాలు హార్ట్ టచింగ్ గా ఉంటుందని కిరణ్ తిరుమలశెట్టి చెప్పారు.

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న “డ్రింకర్ సాయి” సినిమా ఎల్లుండి(ఈనెల 27న) థియేటర్స్ లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో ధర్మ మాట్లాడుతూ తమ సినిమాకు రెబెల్ స్టార్ ప్రభాస్ బెస్ట్ విశెస్ దక్కడం సంతోషంగా ఉందని తెలిపారు. హీరో కావాలనే తన కలను నిజం చేసుకున్నానని, ఇకపైనా ఇదే ప్రయత్నం చేస్తూ ప్రేక్షకుల అభిమానం పొందేలా మంచి సినిమాలు చేస్తానని ధర్మ చెప్పారు.