ఆకట్టుకుంటున్న “డ్రింకర్ సాయి” కలెక్షన్స్

చిన్న చిత్రాలకు టాక్ బాగున్నా ప్రేక్షకులు థియేటర్స్ కు కదలని పరిస్థితి చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన “డ్రింకర్ సాయి” సినిమా ఇంప్రెసివ్ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సినిమా గత నెల 27న థియేటర్స్ లోకి వచ్చింది. తొలి రోజు నుంచే యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స కు రీచ్ అయ్యింది. ప్రమోషన్ లో చూపించినట్లు ఇబ్బందికర కంటెంట్ లేకుండా మంచి ఎమోషన్ తో కథ సాగడంతో వుమెన్ ఆడియెన్స్ ఆదరణ చూపించారు.

ఇలా అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకుంటూ రిలీజైన 5 రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.11 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకుందీ సినిమా. ఫస్ట్ వీకెండ్ కు “డ్రింకర్ సాయి” బాక్సాఫీస్ దగ్గర మంచి నెంబర్ తెచ్చుకునేలా కనిపిస్తోంది. “డ్రింకర్ సాయి” చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు.