సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాలు సృష్టించేవి చిన్న చిత్రాలే. అలాంటి సెన్సేషనల్ సక్సెస్ అందుకుంటోంది “డ్రింకర్ సాయి” సినిమా. ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా గత నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి వసూళ్లు అందుకుంటోందీ మూవీ.
ఇటీవల సక్సెస్ మీట్ లో తమ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యిందన, తాము సేఫ్ గా ఉన్నామని ప్రొడ్యూసర్ ప్రకటించారు. “డ్రింకర్ సాయి” సినిమాలోని ఎమోషన్, ఫన్ ఎలిమెంట్స్, లవ్ స్టోరీ, సూపర్ హిట్ మ్యూజిక్, ఫైట్స్..ఇవన్నీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి.
“డ్రింకర్ సాయి” చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు.