సౌత్ లో సీక్వెల్ గా వచ్చిన మూవీస్ సక్సెస్ అయిన సందర్భాలు చాలా తక్కువ. కానీ బాలీవుడ్ లో సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర గదర్ 2, ఓ మై గాడ్ 2 సినిమాలు రికార్డుల దుమ్ము దులిపేస్తుండగా..ఇప్పుడు డ్రీమ్ గర్ల్ 2 దండయాత్ర మొదలైంది. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే అదిరిపోయే కలెక్షన్స్ అందుకుంది.
ఆయుష్మాన్ ఖురానా, అనన్య పాండే జంటగా నటించిన డ్రీమ్ గర్ల్ 2 సినిమా ఫస్ట్ డే డబుల్ డిజిట్ వసూళ్లు సాధిస్తుందనే ట్రేడ్ వర్గాల అంచనాలను నిజం చేస్తూ ఈ సినిమా 10 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ దక్కించుకుంది. మిడ్ రేంజ్ బడ్జెట్ తో వచ్చిన డ్రీమ్ గర్ల్ 2 సినిమాకు ఇది గుడ్ ఓపెనింగ్ గా చెబుతున్నారు.
సినిమాకు క్రిటిక్స్, ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్ కు ఈ సినిమా మంచి వసూళ్లు సాధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్ లో రాజ్ శాండిల్య రూపొందించారు. గతంలో వచ్చి హిట్ అయిన డ్రీమ్ గర్ల్ కు సీక్వెల్ గా తెరకెక్కిందీ చిత్రం.