“డ్రాగన్” ఫస్ట్ లుక్ వచ్చేది ఆ రోజే

ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్ సినిమా సెట్ లో అడుగుపెట్టబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంపార్టెంట్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ మెంట్ కోసం ఓ స్పెషల్ డేట్ ఫిక్స్ చేశారట మేకర్స్. ఎన్టీఆర్ బర్త్ డే అయిన మే 20 ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది.