నల్లగొండకు చెందిన డాక్టర్ పురుషోత్తమాచార్యులు ఈరోజు ప్రకటించిన 2021 సంవత్సరపు జాతీయ సినిమా అవార్డులలో ఉత్తమ సినీ విమర్శకుడిగా జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన గత రెండేళ్లుగా మిసిమి మాస పత్రికలో సినిమా పాటల్లో శాస్త్రీయ సంగీతంపై ఆయన లోతైన పరిశోధన చేస్తూ వ్యాసాలు రాశారు. 2021 సంవత్సరంలో రాసిన వ్యాసాలకు పురుషోత్తమాచార్యులు ఉత్తమ విమర్శకుడిగా జాతీయ అవార్డ్ గెలుపొందారు.
డాక్టర్ పురుషోత్తమాచార్యులు చందాల కేశవదాసు జీవిత సాహిత్యం అన్న అంశంపై ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ పొందారు. తెలుగు సినిమాలో పాటలు, సాహిత్యం, సంగీతాలపై పై వారికి లోతైన అవగాహన ఉంది. ఆ అవగాహనతోనే పురుషోత్తమాచార్యులు మిసిమి మాస పత్రికలో రెండేళ్లుగా వ్యాసాలు రాస్తూ ఉన్నారు.