పవన్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్

ఇప్పుడు పాత సినిమాలను కొత్తగా రిలీజ్ చేయడం అనే ట్రెండ్ నడుస్తుంది. అదే.. రీ రిలీజ్ ట్రెండ్. పవన్ కళ్యాణ్‌ నటించిన జల్సా, ఖుషి చిత్రాలను రీ రిలీజ్ చేయగా సరికొత్త రికార్డులు సెట్ చేశాయి. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్ నటించిన గుడుంబా శంకర్ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మెగా బ్రదర్ నాగబాబు అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. అంతే కాకుండా.. ఈ సినిమా ద్వారా వచ్చిన అమౌంట్ ని జనసేన పార్టీకి ఫండ్ గా ఇస్తామని కూడా ప్రకటించారు.

ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని సినిమా గబ్బర్ సింగ్ ని కూడా రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారట. ఈ విషయాన్ని గబ్బర్ సింగ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ తెలియచేశారు. దీనితో గుడుంబా శంకర్ తర్వాత వెంటనే గబ్బర్ సింగ్ ట్రీట్ తో పవన్ ఫ్యాన్స్ కి డబుల్ బ్లాస్ట్ దక్కుతుంది అని చెప్పాలి. దీంతో పవర్ స్టార్ బర్త్ డే అభిమానులకు నిజంగా పండగే అని చెప్పచ్చు. మరి.. పవన్ పుట్టినరోజున ఓజీ మూవీ నుంచి అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఏదైనా అప్ డేట్ ఇస్తారేమో చూడాలి.