సందర్భం అదే…ట్యూన్ అదే

ఇస్మార్ట్ శంకర్ (Ismart shankar) లో పాటలు హిట్. అప్పటికి పూరి (Puri jagannath)కి ఓ మస్ట్ హిట్ కావాలి కాబట్టి మణిశర్మ (manisharma)కు ఏం చెప్పాడో ఏంటో పాటలు మాత్రం ఛాట్ బస్టర్ అయ్యాయి. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ లో పాటలకు పెద్ద క్రెడిట్ ఇవ్వొచ్చు. ఇప్పుడు అదే సినిమా సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ (double ismart)మ్యూజిక్ ప్రమోషన్స్ బిగిన్ అయ్యాయి. ఫస్ట్ లిరికల్ సాంగ్ గా స్టెప్పామార్ (steppamar) రిలీజ్ చేశారు.

ఈ పాట ట్యూన్ ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్ లాగే ఉంది. పాట రూపొందించిన సందర్భం కూడా అదే. అందుకే అలాంటి ట్యూనే కావాలని ఉంటాడు పూరి. అదే ఇచ్చాడు మణిశర్మ. ఈ పాటకు భాస్కరభట్ల (Bhaskarabatla) లిరిక్స్ అందించాడు. అనురాగ్ కులకర్ణి (Anurag kulkarni), సాహితీ పాడారు. డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ సాంగ్ స్టెప్పామార్ మ్యూజిక్ ప్రమోషన్స్ కు మంచి బిగినింగ్ ఇవ్వలేకపోయింది. ఆగస్టు 15న డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కు వస్తోంది.