రాజకీయ విబేధాలు ఉంటే పవన్ తో తేల్చుకోవాలని..అంతేగానీ తన పిల్లల జోలికి రావొద్దంటూ తేల్చి చెప్పింది పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్. పవన్ భార్యలు, పిల్లలపై సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తామంటూ కొందరు వ్యాఖ్యానించిన నేపథ్యంలో రేణూ దేశాయ్ స్పందించింది. ఇవాళ ఆమె ఇన్ స్టా వీడియో ద్వారా ఈ విషయంపై మాట్లాడింది.
రేణు స్పందిస్తూ…నేను రీసెంట్ గా విదేశాల నుంచి తిరిగి వచ్చాను. రాగానే నాకో విషయం తెలిసింది. నా మాజీ భర్త పవన్ కల్యాణ్ రాజకీయ ప్రత్యర్థులు పవన్ వ్యక్తిగత జీవితం గురించి, ఆయన భార్యలు, పిల్లల గురించి సినిమా లేదా వెబ్ సిరీస్ రూపొందిస్తామని అన్నారట. నేను వారికి చేసే రిక్వెస్ట్ ఒకటి. పవన్ రాజకీయాల్లోకి నా పిల్లల్ని తీసుకురాకండి. ఎందుకంటే వాళ్లు పిల్లలు. సినిమా స్టార్ కుటుంబంలో పుట్టి ఉండవచ్చు. ఆయన సినిమాలకు వాళ్లు వెళ్తుండవచ్చు. కానీ పవన్ రాజకీయాలతో వారికి ఏ సంబంధం లేదు. అని చెప్పింది.
రేణూ దేశాయ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ప్రస్తుతం రవితేజ రావణాసుర సినిమాలో ఓ కీలక పాత్రను పోషిస్తోంది.