నాని హీరోగా నటిస్తున్న హాయ్ నాన్న సినిమా రిలీజ్ డేట్ మారనుందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాని హీరోగా నటిస్తున్న ఈ 30వ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్నారు. ఫాదర్, డాటర్ సెంటిమెంట్ నేపథ్యంలో హాయ్ నాన్న తెరకెక్కుతోంది.
ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం హాయ్ నాన్న సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఈ డేట్ ను మరికొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. సమయమా అనే పాటను తొలి లిరికల్ సాంగ్ గా విడుదల చేస్తున్నారు.
ఈ పాట రిలీజ్ పోస్టర్ పై సినిమా రిలీజ్ డేట్ మెన్షన్ చేయకపోవడంతో హాయ్ నాన్న విడుదల వాయిదా పడనుందా అనే సందేహాలు మొదలయ్యాయి. డిసెంబర్ రిలీజ్ వాయిదా పడితే మళ్లీ సంక్రాంతి సీజన్ ఇప్పటికే భారీ సినిమాలతో ప్యాక్ అయి ఉంది. ఫిబ్రవరిలో ఛాన్స్ ఉండొచ్చు.
అయితే దీని మీద మూవీ టీమ్ స్పందించలేదు. ప్రస్తుతం గోవాలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.