ప్రభాస్ కు జంటగా దిశా పటానీ..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఓ వైపు రాజాసాబ్ మూవీ చేస్తూనే మరో వైపు ఫౌజీ చేస్తున్నాడు ప్రభాస్. రాజాసాబ్ మూవీ ఏప్రిల్ 10న రావాలి కానీ.. షూటింగ్ అనుకున్న ప్లాన్ ప్రకారం జరగకపోవడం వలన పోస్ట్ పోన్ అయ్యింది. అయితే.. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంకా ఫైనల్ కాలేదు. సెప్టెంబర్ లో రాజాసాబ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఫౌజీ విషయానికి వస్తే.. హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది.

ఫౌజీ సినిమాలో ఇద్దరు కథానాయికలు. ఆల్రెడీ ఇమాన్వీని తీసుకున్నారు. మరో కథానాయిక ఎవరంటే.. సాయిపల్లవి పేరు వినిపించింది కానీ.. ఇప్పుడు దిశా పటానీని ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. దిశా పటానీ ప్రభాస్ కు జంటగా కల్కి మూవీలో నటించింది. కల్కిలో ప్రభాస్, దిశా పటానీల పై చిత్రీకరించిన సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా కోసం దిశా పటానీని కాంటాక్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఫౌజీ సినిమాలో దిశా నటించడం అనేది కన్ ఫర్మ్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక జరిగితే.. ప్రభాస్ తో దిశాకు ఇది రెండో సినిమా అవుతుంది. కల్కి పార్ట్ 2 లో కూడా దిశా నటించనుంది.