రాజమౌళి వల్ల చనిపోతున్నానంటూ ఆయన స్నేహితుడి సెల్ఫీ వీడియో

ప్రముఖ దర్శకుడు రాజమౌళిపై ఆయన స్నేహితుడు యు శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి. రాజమౌళి, ఆయన భార్య రమ పెట్టిన టార్చర్ వల్లే తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు సెల్ఫీ వీడియో ద్వారా తెలిపారు శ్రీనివాసరావు. 1990 నుంచి తాము క్లోజ్ ఫ్రెండ్స్ అని, రాజమౌళి శాంతి నివాసం టైమ్ నుంచి ఆయనతో పాటే ఉన్నానని శ్రీనివాసరావు తన వీడియోలో వెల్లడించారు.

ఒక సందర్భంలో తమ మధ్య విబేధాలు వచ్చాయని అప్పటి నుంచి తనను ఇండస్ట్రీలో లేకుండా చేసేందుకు రాజమౌళి అన్ని ప్రయత్నాలు చేశాడని శ్రీనివాసరావు ఆరోపించారు. తాను పబ్లిసిటీ కోసం ఇదంతా చేయడం లేదని, తన వీడియోను సుమోటోగా తీసుకుని రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.