రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీ రిజల్ట్ గురించి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు శంకర్. ఈ సినిమా దర్శకుడిగా తానేంటో చూపిస్తుందని ఆయన అన్నారు. పొలిటికల్ డ్రామాగా శంకర్ రూపొందిస్తున్న గేమ్ ఛేంజర్ జనవరి 10న థియేటర్స్ లోకి రాబోతోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శంకర్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ – భారతీయుడు 2 సినిమాకు నెగిటివ్ రివ్యూస్ రావడం ఊహించలేదు. అలా రివ్యూస్ రాస్తారని అనుకోలేదు. నా నెక్ట్స్ మూవీస్ గేమ్ ఛేంజర్, భారతీయుడు 3 దర్శకుడిగా నేనేంటో చూపిస్తాయి. భారతీయుడు 2 విమర్శల నుంచి బయటకు వచ్చాను. భారతీయుడు 3 థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుంది. అని చెప్పారు.