గేమ్ ఛేంజర్ సినిమాపై దర్శకుడు శంకర్ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఓ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ శంకర్ గేమ్ ఛేంజర్ సినిమా నిడివి గురించి మాట్లాడారు. ఈ సినిమాకు 5 గంటల నిడివి ఉందని, అయితే ఎడిటింగ్ లో మంచి సీన్స్ తీసేయాల్సివచ్చిందని శంకర్ అన్నారు. గేమ్ ఛేంజర్ ఔట్ పుట్ పట్ల తాను సంతృప్తిగా లేనని శంకర్ అనడం వైరల్ గా మారింది.
శంకర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండు భాగాల సినిమాకు 5 గంటల ఫుటేజ్ తీస్తే ఓకే గానీ, ఒక సినిమాకు 5 గంటల ఫుటేజ్ వచ్చేలా షూటింగ్ చేయడం ఎంత వృథా ఖర్చు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాకు రోజుకు దాదాపు కోటి రూపాయల ప్రొడక్షన్ కాస్ట్ అయ్యిందట ఈ లెక్కన పక్కకు పెట్టిన ఫుటేజ్ విలువ ఎన్ని కోట్లు అనేది ప్రొడ్యూసర్ పై అనవసరంగా ఎంత భారంగా మారిందనేది అంచనా వేసుకోవచ్చు.