కంటెంట్ బాగున్న “డీమాంటీ కాలనీ 2” సక్సెస్ అవుతుంది – డైరెక్టర్ ఆర్జీవీ

రీసెంట్ గా తమిళనాట రిలీజై పెద్ద సినిమాలతో పోటీ పడి కలెక్షన్స్ అందుకుంటోంది హారర్ థ్రిల్లర్ సినిమా “డీమాంటీ కాలనీ 2″(Demonty colony 2). ఈ సినిమాను శ్రీ బాలాజీ ఫిలింస్(Sri balaji films) బ్యానర్ పై ఈ నెల 23న తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాతలు బి సురేష్ రెడ్డి, బి. మానస రెడ్డి. ఎన్ శ్రీనివాస రెడ్డి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు రూపొందించారు. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన “డీమాంటీ కాలనీ 2” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో

నిర్మాత బి.సురేష్ రెడ్డి మాట్లాడుతూ – “డీమాంటీ కాలనీ 2” అనౌన్స్ అయినప్పటి నుంచి డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు గారితో ట్రావెల్ అవుతున్నాను. వీఎఫ్ఎక్స్ వల్ల మూవీ రిలీజ్ కొంత డిలే అయ్యింది. తమిళంలో బిగ్ హిట్ అయ్యిందీ సినిమా. తెలుగులోనూ అంతకంటే పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా. ఇందులో హారర్ కంటే థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఆకట్టుకుంటాయి. అన్నారు.

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ – డీమాంటీ కాలనీ 2 సినిమా ఇప్పటికే తమిళంలో విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులోకి వస్తోంది. సురేష్ రెడ్డి గారు బాగా ప్రమోట్ చేస్తున్నారు. నిర్మాతగా ఆయన టేస్ట్ బాగుంటుంది. తమిళ్ నుంచి ఇక్కడ డీమాంటీ కాలనీ 2 ప్రీమియర్ చూసిన వాళ్ల దగ్గర నుంచి మంచి టాక్ వచ్చింది. కంటెంట్ బాగున్న “డీమాంటీ కాలనీ 2” సినిమా తెలుగులో ఆదరణ పొందుతుంది. అన్నారు.