కల్కిలో రాజమౌళి గెస్ట్ రోల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా కల్కి 2898 ఏడీ. 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నారు. దీపికా పడుకొన్, అమితాబ్ బచ్చన్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నా..ఆ టైమ్ కు వర్క్ ఫినిష్ అవడం కష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ సినిమా విడుదల తేదీని మే నెలకు మార్చారట. కల్కి 2898 ఏడీ నుంచి తాజాగా మరో అప్ డేట్ తెలుస్తోంది.

ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి అతిథి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. కథలో కీలకంగా ఉండే ఒక గెస్ట్ రోల్ కోసం టీమ్ రాజమౌళిని సంప్రదించారట. ప్రభాస్ తో తనకున్న అనుబంధం దృష్ట్యా ఈ క్యారెక్టర్ లో నటించేందుకు రాజమౌళి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా కామిక్ కాన్ లో రిలీజ్ చేసిన కల్కి 2898 ఏడీ గ్లింప్స్ ఈ సినిమా ఎలా ఉంటుందో హింట్ ఇచ్చింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఎడిట్ సూట్ నుంచి రిలీజ్ చేసిన ప్రభాస్ విశెస్ వీడియో కట్ కూడా
అటు చిరు అభిమానులతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ ను అలరించింది.