హనుమాన్ మూవీతో పాపులర్ అయ్యాడు ప్రశాంత్ వర్మ. ఈ యంగ్ డైరెక్టర్ తాజాగా జాంబిరెడ్డి సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే.. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. అందుచేత ఆయన కథ మాత్రమే అందిస్తాడని.. ఈ సీక్వెల్ ను తెరకెక్కించే బాధ్యతను మరో డైరెక్టర్ కి ఇస్తారని సమాచారం.
ఈ క్రేజీ సీక్వెల్ ను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించనున్నారు. ఈ మూవీని తెరకెక్కించే డైరెక్టర్ ఎవరు అనేది ఫైనల్ అయిన తర్వాత అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలిసింది. ప్రస్తుతం మిరాయి సినిమా షూట్ లో తేజ సజ్జ బిజీగా ఉన్నాడు. ఆ మూవీ కంప్లీట్ అయిన తర్వాత జాంబిరెడ్డి సీక్వెల్ స్టార్ట్ చేస్తారని సమాచారం.