“రాజా సాబ్”పై ఎగ్జైటింగ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ మారుతి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ మూవీ రూపొందిస్తున్నారు టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. హారర్ కామెడీ జానర్ లో ప్రభాస్ ఫస్ట్ టైమ్ చేస్తున్న సినిమాగా రాజా సాబ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమా అప్డేట్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు డైరెక్టర్ మారుతి. కొంత టాకీ, సాంగ్స్ మాత్రమే షూటింగ్ మిగిలి ఉందని ఆయన తెలిపారు. సీజీ వర్క్ కంప్లీట్ అయ్యాక రాజా సాబ్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని మారుతి వెల్లడించారు.

డైరెక్టర్ మారుతి ట్వీట్ చేస్తూ – పాజిటివ్, కాన్ఫిడెంట్ గా మా రాజా సాబ్ సినిమా షూటింగ్ జరుగుతోంది. సినిమా టీమ్ వర్క్ కాబట్టి కొన్నిసార్లు డిలేస్ తప్పవు. కొంత టాకీ, సాంగ్స్ మాత్రమే షూటింగ్ మిగిలిఉంది. సాంగ్స్ కంప్లీట్ చేశాక లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేస్తాం. సీజీ వర్క్స్ కోసం కొన్ని కంపెనీలు పనిచేస్తున్నాయి. వాటి నుంచి ఫైనల్ ఔట్ పుట్ వచ్చాక రాజా సాబ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. అన్నారు.