డైరెక్టర్ క్రిష్ మరోసారి వివాహిక జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఆయన గతంలో రమ్య అనే వైద్యురాలిని పెళ్లి చేసుకున్నారు. 2018లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి క్రిష్ ఒంటరిగానే ఉంటున్నారు. ఇటీవల ప్రీతి అనే వైద్యురాలితో క్రిష్ కు పెళ్లి సంబంధం చూశారు. ఒకనొకరు ఇష్టపడటంతో కుటుంబ సభ్యులు క్రిష్, ప్రీతి వివాహానికి ఏర్పాట్లు చేశారు.
వీరి వివాహం రేపు (ఈ నెల 10న) జరగనుంది. క్రిష్ పెళ్లి వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. పవన్ కల్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమా చేసి, ఆ సినిమా షూటింగ్ ఆలస్యమవుతుండటంతో మధ్యలోనే బయటకు వచ్చారు క్రిష్. ఇప్పుడు అనుష్క నాయికగా ఘాటి అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్నాయి.