“మిర్చి” కాంబో రెడీగా ఉంది

రెబల్ స్టార్ ప్రభాస్(Rebelstar Prabhas) తన కెరీర్ లో స్టైలిష్ గా అందంగా కనిపించిన సినిమా మిర్చి(Mirchi). ఫ్యాక్షన్ గొడవల నేపథ్యంతో దర్శకుడు కొరటాల శివ(Koralata siva) ఈ సినిమాను రూపొందించారు. మూవీ బ్యాక్ డ్రాప్ పాతదే అయినా దాన్ని స్క్రీన్ మీద సరికొత్తగా పవర్ ఫుల్ గా చూపించారు దర్శకుడు కొరటాల శివ. అప్పటికే రైటర్ గా బాగా పేరున్న కొరటాల..మిర్చితో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మిర్చి హిట్ తో ప్రభాస్, కొరటాల కాంబోకు మంచి పేరొచ్చింది.

ఇప్పుడిదే కాంబోలో మరో మూవీ రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ తో మరో సినిమా చేయబోతున్నట్లు కొరటాల ఇటీవల దేవర(Devara) ఇంటర్వ్యూలో వెల్లడించారు. కథ సిద్ధంగా ఉందని, ప్రభాస్ ను కలిసిన తర్వాత ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తానని కొరటాల చెప్పాడు. అయితే ప్రభాాస్ కు ది రాజా సాబ్, సలార్ 2, స్పిరిట్, హను రాఘవపూడి సినిమా..ఇలా బిగ్ లైనప్ ఉంది. కొరటాల శివ దేవర 2 చేయాలి. ఇవన్నీ అయ్యాకే వీరి కాంబోను ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.