ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్న కొత్త సినిమా దేవర. మత్స్యకారుల లైఫ్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా..బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. దేవర ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ కొత్త న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాలో ఎన్టీఆర్ తో ఓ వాటర్ ఫైట్ సీక్వెన్స్ డిజైన్ చేయించారట. ఈ ఫైట్ సీన్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇక ఈ వాటర్ సీక్వెన్స్ కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా సిద్ధమయ్యారట. దేవరలో యాక్షన్, స్టంట్స్ డిజైన్ కోసం ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు గ్రాఫిక్స్ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతోందని తెలుస్తోంది. ఓ భారీ మొత్తాన్ని విజువల్ ఎఫెక్టుల కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.