దర్శకుడు బుచ్చిబాబు సాన ఫస్ట్ మూవీ ఉప్పెనకు బెస్ట్ తెలుగు మూవీగా నేషనల్ అవార్డ్ దక్కింది. దీంతో ఆ టీమ్ సెలబ్రేట్ చేసుకుంది. కెప్టెన్ ఆఫ్ ది షిప్ గా చెప్పుకునే దర్శకుడు బుచ్చిబాబు మరింత సంతోషంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఇచ్చిన మీడియా బ్రీఫ్స్ లో బుచ్చిబాబు రామ్ చరణ్ తో చేయబోయే సినిమా గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ మాటలతో చరణ్ బుచ్చిబాబు సినిమాపై మరింత హైప్స్ పెరుగుతున్నాయి.
బుచ్చిబాబు సాన మాట్లాడుతూ – రామ్ చరణ్ సినిమా కోసం నేను నాలుగేళ్లుగా కథను సిద్ధం చేసుకున్నాను. ఇది నా ఫేవరేట్ స్టోరి. రా అండ్ రస్టిక్ గా ఉంటుంది. అని చెప్పాడు. ఈ మాటలతో బుచ్చిబాబు చాలా కాన్ఫిడెంట్ గా మూవీని చేయబోతున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోంది.
ఈ సినిమాలో కబడ్డీ ప్లేయర్ గా రామ్ చరణ్ కనిపించనున్నారు. ఆర్సీ 16గా పిలుస్తున్న ఈ సినిమాలో కీ రోల్ కోసం తమిళ నటుడు విజయ్ సేతుపతిని ఇప్పటికే ఎంపిక చేశారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి.