వెంకటేష్ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది. ప్రమోషనల్ కంటెంట్, పాటలతో ఈ మూవీ మంచి క్రేజ్ తెచ్చుకుంది. దీంతో ఆల్రెడీ హిట్ కొట్టేసాం అనే ఫీలింగ్ లో మూవీ టీమ్ ఉన్నారంటే ఎంత పాజిటివ్ టాక్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ మూవీ చూడాలని అనుకుంటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట అనిల్ రావిపూడి. ఈ విషయాన్ని స్వయంగా అనిల్ రావిపూడే ఓ ఇంటర్ వ్యూలో బయటపెట్టాడు.
ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 తీసారు కదా.. మరి.. సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కూడా తీస్తారా అని అడిగితే.. అదే ఆలోచనలో ఉన్నానని.. స్టోరీ లైన్ కూడా రెడీగా ఉందన్నాడు. చూస్తుంటే.. సీక్వెల్ తో మరో సంక్రాంతికి కూడా మరో సక్సెస్ సాధించేలా ఉన్నాడు. అదే జరిగితే.. దిల్ రాజుకు మరో సక్సెస్ రావడం ఖాయం అని చెప్పచ్చు. మరి.. ఈ సినిమా రిలీజై సక్సెస్ అనిపించుకున్న తర్వాత అనౌన్స్ చేస్తారేమో చూడాలి.