“భగవంత్ కేసరి” రీమేక్ నుంచి తప్పుకున్న అనిల్ రావిపూడి

కోలీవుడ్ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఆఖరి సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇది విజయ్ 69వ చిత్రం. అయితే.. ఈ చిత్రం గురించి ఓ వార్త గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉంది. అది ఏంటంటే.. విజయ్.. బాలయ్య నటించిన భగవంత్ కేసరి చిత్రాన్ని రీమేక్ చేయనున్నారని.. త్వరలో ప్రకటిస్తారని అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతూనే ఉంది.

పాపులర్ కమెడియన్ విటివి గణేష్.. అసలు విషయం బయటపెట్టారు. విజయ్ భగవంత్ కేసరి చిత్రాన్ని చాలా సార్లు చేశారట. అంతలా ఈ సినిమా నచ్చేసిందట. అందుకనే ఈ సినిమాను తమిళ్ కి రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యారట. అంతే కాకుండా.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లోనే చేయాలి అనుకున్నారట. అయితే.. అనిల్ కొన్ని కారణాల వలన ఈ సినిమాను రీమేక్ చేయలేనని చెప్పడంతో కోలీవుడ్ డైరెక్టర్ హెచ్ వినోద్ కు ఆ బాధ్యతలు అప్పగించారట. వినోద్ కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారని చెప్పారు. ఈ విధంగా విజయ్ చేస్తోన్న భగవంత్ కేసరి రీమేక్ గురించి సీక్రెట్ బయటపెట్టారు కమెడియన్ గణేష్‌.