చిరంజీవి, నాగార్జున.. ఈ ఇద్దరూ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది అందరికీ తెలిసిందే. ఎప్పటి నుంచో కలిసి సినిమా చేయాలి అనుకుంటున్నారు కానీ.. కథ కుదరడం లేదు. ఇప్పుడు ఈ ఇద్దరు మిత్రులతో సినిమా ప్లానింగ్ లో ఉందని టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తోన్న విశ్వంభర సంక్రాంతికి రావాలి కానీ.. సమ్మర్ లో వచ్చేందుకు రెడీ అవుతోంది. ఆతర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేయనున్నట్టుగా ఇటీవల ప్రకటించారు. అలాగే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా చిరంజీవి ఓ సినిమా చేయనున్నారని.. త్వరలోనే అనౌన్స్ మెంట్ ఉంటుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. చిరు, అనిల్ రావిపూడి కాంబో మూవీ అంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
చిరు, అనిల్ రావిపూడి మూవీలో నాగార్జున కూడా నటించనున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమధ్య నాగార్జునతో అనిల్ రావిపూడి సినిమా అంటూ ప్రచారం జరిగింది. అయితే.. అనిల్ రావిపూడి చిరు, నాగ్ ఇద్దరినీ ఒకేసారి డైరెక్ట్ చేసేలా కథ రెడీ చేస్తున్నారట. ఇద్దరు హీరోలను డీల్ చేయడం అనిల్ కు బాగా తెలుసు. ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో వెంకీ, వరుణ్ ఇద్దర్నీ బాగా డీల్ చేసి బ్లాక్ బస్టర్ అందించాడు. అలాగే సీనియర్ హీరోలను ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టుగా ఎలా చూపించాలో బాగా తెలుసు. ఈ కాంబోలో మూవీ చేయాలని అనిల్ అనుకున్న మాట వాస్తవమే అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.