సినిమాలోని మ్యాజిక్ కనెక్ట్ దిల్ రూబా సినిమా బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించనంత పెద్ద రేంజ్ కు వెళ్తుందని అన్నారు హీరో కిరణ్ అబ్బవరం. దిల్ రూబా రేపు థియేటర్స్ లోకి వస్తున్న సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ లో రిలీజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ తో పాటు డైరెక్టర్ విశ్వకరుణ్, హీరోయిన్ క్యాతీ డేవిసన్, డీవోపీ డేనియల్ విశ్వాస్, ప్రొడక్షన్ డిజైన్ సుధీర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – “దిల్ రూబా” కథలో ప్రేమ ఒక్కటే కాదు స్నేహం, ఫాదర్ సన్, ఫాదర్ డాటర్ రిలేషన్..ఇలా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఎక్స్ లవర్ మళ్లీ ఆ ప్రేమికుడి జీవితంలోకి వచ్చి అతని ప్రెజెంట్ లవ్ ను కలిపే ప్రయత్నం చేయడం అనేది “దిల్ రూబా”లో కొత్తగా ఉంటుంది. ఈ మూవీలో నటించిన తర్వాత నటుడిగా ఇంకాస్త పరిణితి సాధించా అనిపించింది. ఫైట్స్ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాను. క సినిమా కంటెంట్ , స్క్రీన్ ప్లే మీద వెళ్తుంది. ఆ సినిమా సక్సెస్ ను ప్రెడిక్ట్ చేయొచ్చు కానీ దిల్ రూబా మ్యాజిక్ మూవ్ మెంట్స్ మీద వెళ్లే కమర్షియల్ మూవీ. ఈ కథకు మీరు కనెక్ట్ అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఉహించనంత రేంజ్ కు వెళ్తుంది. అన్నారు.