హీరో కిరణ్ అబ్బవరం నటించిన దిల్ రూబా సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ కు వస్తుండగా..ఈ నెల 6న ట్రైలర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. సరిగ్గా 10 రోజుల్లో ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. 6న ట్రైలర్ రిలీజ్ చేయడం ద్వారా మూవీకి కావాల్సినంత హైప్ క్రియేట్ చేయాలని టీమ్ భావిస్తున్నారు.
క వంటి సూపర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన చిత్రంగా దిల్ రూబాపై అటు ట్రేడ్ వర్గాల్లో, ఇటు ఆడియన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు విశ్వ కరుణ్. సామ్ సీఎస్ కంపోజ్ చేసిన సాంగ్స్ మంచి హిట్ కావడం దిల్ రూబాకు అడ్వాంటేజ్ అవుతోంది. రీసెంట్ గా కన్నా నీ సాంగ్ రిలీజ్ చేయగా..ఇన్ స్టంట్ గా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కిరణ్ అబ్బవరంగా ను దిల్ రూబా కొత్తగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతోంది.