నిర్మాత దిల్ రాజుకు సంబంధించిన కార్యాలయాలు, ఇళ్లపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. వీటిపై స్పందించింది దిల్ రాజు సతీమణి తేజస్వినీ. ఇవి సాధారణంగా జరిగే రైడ్స్ అని ఆమె అన్నారు. బ్యాంక్ అక్కౌంట్ డీటెయిల్స్ అడిగారని ఆమె చెప్పారు. ఈ రోజు ఉదయం నుంచి దిల్ రాజు, శిరీష్, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దిల్ రాజు సతీమణిని బ్యాంక్ కు తీసుకెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసుల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇటీవల దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఘన విజయాన్ని సాధించి, మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.