అక్కౌంట్స్ అన్నీ క్లియర్ గా ఉన్నాయి – దిల్ రాజు

తమ సంస్థలపై జరుగుతున్న ఐటీ దాడులపై స్పందించారు నిర్మాత దిల్ రాజు. ఈ రోజు మీడియాతో ఈ విషయంపై మాట్లాడారు. ఏమీ లేని దాన్ని మీడియా హైప్ చేసిందని దిల్ రాజు చెప్పారు. తమ వద్ద మొత్తం 20 లక్షలకు మించి నగదు లేదని, ఆ డబ్బుకు కూడా లెక్కలు ఉన్నాయని, అక్కౌంట్స్ అన్నీ క్లియర్ గా ఉన్నాయని దిల్ రాజు తెలిపారు.

గత ఐదేళ్లలో తాము ఎక్కడా ప్రాపర్టీస్ కొనలేదని, అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పామని దిల్ రాజు తెలిపారు. 90 శాతం టికెట్స్ ఆన్ లైన్ లోనే కొనుగోలు జరుగుతున్నాయని, అలాంటప్పుడు బ్లాక్ మనీ ఎలా ఉంటుందని దిల్ రాజు అన్నారు. ఫేక్ కలెక్షన్స్ గురించి ఇండస్ట్రీ అంతా కూర్చుని మాట్లాడుకుంటామని ఆయన తెలిపారు.