స్టార్ ప్రొడ్యూసర్ గా ఉంటూనే డిస్ట్రిబ్యూషన్ లోనూ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు దిల్ రాజు. ఆయన ప్రస్తుతం గేమ్ చేంజర్, వీడీ 13 వంటి భారీ మూవీస్ ప్రొడ్యూస్ చేస్తూనే మరోవైపు డిస్ట్రిబ్యూషన్ లో బిగ్ ఫిల్మ్స్ తీసుకుంటున్నారు. రానున్న దసరా సీజన్ కు నైజాం డిస్ట్రిబ్యూషన్ లో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ చేయబోతున్నారు దిల్ రాజు.
బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి, కోలీవుడ్ హీరో విజయ్ లియో సినిమాలు దసరా పండక్కి రిలీజ్ అవుతున్నాయి. వీటిని నైజాంలో రిలీజ్ చేస్తున్నారు దిల్ రాజు. భగవంత్ కేసరి, లియో అక్టోబర్ 19న విడుదలవుతున్నాయి. లియో తెలుగు హక్కులను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ తీసుకుంది. ఈ సినిమాతో ఈ ప్రొడక్షన్ హౌస్ డిస్ట్రిబ్యూషన్ లోకి వచ్చింది. సితార నుంచి దిల్ రాజు నైజాం రిలీజ్ రైట్స్ తీసుకున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు దసరాకు రవితేజ టైగర్ నాగేశ్వరరావు ప్రేక్షకుల ముందుకొస్తోంది.
గతంలో స్ట్రైట్ సినిమాల మధ్యే బాక్సాఫీస్ వార్ ఉండేది. కానీ ఇప్పటి పాన్ ఇండియా ట్రెండ్ లో డబ్బింగ్ సినిమాలనూ తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. అందుకే రానున్న దసరాకు భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావుతో పాటు లియో కూడా క్రేజీ మూవీగానే మారింది.