ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో అధ్యక్షుడుగా గెలిచిన విషయం తెలిసిందే. అయితే.. గత కొన్ని రోజులుగా దిల్ రాజు రాజకీయాల్లోకి రానున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయనకు కూడా రాజకీయాల్లోకి రావాలని ఇంట్రస్ట్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో దిల్ రాజు నిజంగానే రాజకీయాల్లోకి వస్తారా..? లేక ఇదంతా గ్యాసిప్పా..? అనేది ఆసక్తిగా మారింది. వాస్తవం ఏంటంటే.. నిజంగానే రాజకీయాల్లోకి వచ్చేందుకు దిల్ రాజు ఆసక్తి చూపిస్తున్నారట. ఇదే కనుక జరిగితే.. ఏ పార్టీలో చేరతారు అంటే.. కాంగ్రెస్ పార్టీ అని వినిపిస్తోంది.
అదేంటి.. కేటీఆర్ తో మంచి అనుబంధం ఉంది. బిఆర్ఎస్ పార్టీలో చేరతారు అనుకుంటే.. కాంగ్రెస్ లో జాయిన్ కావడానికి కారణం ఏంటంటే.. ఆయన బంధువులు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారట. దిల్ రాజు స్వస్థలం నిజామాబాద్ జిల్లా. ఆయన తన సొంత ఊరిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టించడమే కాదు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఒకవేళ బీఆర్ఎస్‌లో చేరితే.. నిజామాబాద్ సీటు వచ్చే అవకాశం లేదు. ఆ సీటు కల్వకుంట్ల కవితకు రిజర్వ్ చేసి ఉంటుంది. అందుకే ఆయన చూపు కాంగ్రెస్ వైపు ఉందని ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకుని సీటు ఆఫర్ చేస్తే.. దిల్ రాజు ఓకే అనచ్చు. మరి.. ఏం జరగనుందో చూడాలి.