దిల్ రాజు రిస్క్ చేయగలడు, మేము చేయలేము, అందుకే ఆయన స్టార్స్ తో సినిమాలు చేస్తున్నాడు, పెద్ద సినిమాల డిస్ట్రిబ్యూషన్స్ చేస్తున్నాడు అంటూ నిర్మాత సురేష్ బాబు దిల్ రాజు గురించి ప్రశంసిస్తుంటాడు. ప్రొడ్యూసర్ గా కంటే డిస్ట్రిబ్యూటర్ గా ఎక్కువ రిస్క్ చేస్తుంటారు దిల్ రాజు. ఈ ప్రాసెస్ లో కొన్ని సక్సెస్ అవుతాయి, మరికొన్ని ఫెయిల్యూర్ అవుతాయి. అయినా డిస్ట్రిబ్యూటర్ గా నైజాంలో దిల్ రాజు ఎక్కడా తగ్గడం లేదు. అలాంటి సందర్భమూ కనిపించదు.
నైజాంలో ఏ పెద్ద స్టార్ సినిమా అయినా, ఏ భారీ డబ్బింగ్ మూవీ అయినా డిస్ట్రిబ్యూషన్ లో దిల్ రాజు ఉండాల్సిందే. ఈ ఇయర్ జైలర్ రిలీజ్ చేసి హిట్ కొట్టిన దిల్ రాజు రీసెంట్ గా మహేశ్ బాబు త్రివిక్రమ్ కాంబో మూవీ గుంటూరు కారం నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను హయ్యెస్ట్ రేట్ కు కొన్నారట. ఇందుకు దిల్ రాజు 42 కోట్ల రూపాయలు చెల్లించారంటూ టాక్ వినిపిస్తోంది.
ఒక సినిమా డిస్ట్రిబ్యూషన్ కు రాజమౌళి సినిమాలను మినహాయించి దిల్ రాజు పెట్టిన అత్యధిక బడ్జెట్ అంటున్నారు. గుంటూరు కారం ఎన్నోసార్లు వాయిదా పడింది, ఆర్టిస్టులు వెళ్లిపోయారు, ఒకసారి కథ మొత్తం మార్చారు. అయినా ఆ కాంబినేషన్ మీద దిల్ రాజు రిస్క్ చేస్తున్నారు. ఆయన్ను సక్సెస్ ఫుల్ గా నడిపించే దారిలోనే వెళ్తున్నారు. ఈ సంక్రాంతికి దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన వీడీ 13తో ఆయనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గుంటూరు కారం థియేటర్స్ లో పోటీ పడుతుండటం విశేషం.