వివాదాస్పద వ్యాఖ్యలపై సారీ చెప్పిన దిల్ రాజు

ఇటీవల నిజామాబాద్ లో జరిగిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బీఆర్ఎస్ నాయకులు దిల్ రాజు వ్యాఖ్యల్ని తప్పుబడుతూ ప్రెస్ మీట్స్ పెట్టారు. సోషల్ మీడియాలోనూ దిల్ రాజు కామెంట్స్ కు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో ఆయన సారీ చెబుతూ ఈరోజు వీడియో రిలీజ్ చేశారు. తన మాటల్ని తప్పుగా అనుకుంటే క్షమించాలని కోరారు. ఎవరినైనా హర్ట్ చేస్తే అందుకు చింతిస్తున్నట్లు వీడియోలో పేర్కొన్నారు.

సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ – ఆంధ్రా వాళ్లకు సినిమా అంటే ఒక వైబ్, మన తెలంగాణలో తెల్లకల్లు, మటన్ కు వైబ్ ఉంటుంది అన్నారు. దిల్ రాజు మాటలు వైరల్ గా మారాయి. అయితే తప్పుడు ఉద్దేశంతో తాను అలా అనలేదని దిల్ రాజు వివరణ ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ నెల 14న థియేటర్స్ లోకి రాబోతోంది.