చిరంజీవితో స్పెషల్ సాంగ్, నో చెప్పిన శ్రీలీల..?

వరుస ఫ్లాప్స్ తో కెరీర్ గ్రాఫ్ పడిపోయోలా చేసుకుంది హీరోయిన్ శ్రీలీల (Heroine Sree leela). తన క్యారెక్టర్ ఎలాంటి స్కోప్ లేకున్నా కేవలం స్టార్ హీరోల సినిమాలు అంటూ వరుసగా చేసేసింది. ఈ సినిమాలు ఫ్లాప్స్ అవుతుండటంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది. మల్లీ ఇలాంటివి చేయకూడదని ఏకంగా మెగాస్టార్ (Megastar chiranjeevi) విశ్వంభర (Vishwambhara) ఆఫర్ ను కూడా తిరస్కరించిందట శ్రీలీల.

ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించేందుకు శ్రీలీలలను టీమ్ అప్రోచ్ కాగా ఆమె నేను చేయలేనంటూ స్మూత్ గా చెప్పిందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే హీరోయిన్ గా తను ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి టైమ్ లో స్పెషల్ సాంగ్స్ చేస్తే తనపై ఇండస్ట్రీ అదే ముద్ర వేస్తుందని శ్రీలీల భావిస్తోంది. విశ్వంభర సినిమాను దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నారు. త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.