సాయి పల్లవి టాలెంటెడ్ హీరోయిన్. గ్లామర్ కంటే యాక్టింగ్ కు స్కోప్ ఉన్న సినిమాలేే ఎంచుకుంటుంది. ఆమె నటిస్తే ఆ క్యారెక్టర్ పర్ ఫార్మెన్స్ బాగుంటుందని ప్రేక్షకులకు ఒక అంచనా ఉంటుంది. ఆ సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుందనీ ఆశిస్తారు. ఈ క్రమంలో చాలా రేర్ గా సినిమాలు చేస్తూ వస్తోంది సాయి పల్లవి. కొత్తదనం ఉన్న సినిమాల కోసం ప్రయత్నించడంలో తప్పులేదు అయితే కెరీర్ లో కంటిన్యూగా సినిమాలు చేయడమూ ముఖ్యమే. లేకుండే ఇండస్ట్రీతో పాటు ఆడియెన్స్ మర్చిపోయే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ విరాటపర్వం, గార్గి సినిమాల తర్వాత సాయి పల్లవి ఇప్పటిదాకా తెరపై కనిపించలేదు.
మంచి సినిమాలే చేయాలనే తపనలో భారీ చిత్రాలు కూడా వదులుకుంటోందట సాయి పల్లవి. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమాలో సోదరి క్యారెక్టర్ కోసం సంప్రదిస్తే నటించలేనని సున్నితంగా ఆ ఆఫర్ తిరస్కరించిందట. ఎందుకని ఆ తర్వాత ఇంటర్వూస్ లో అడిగితే భోళా శంకర్ రీమేక్ సినిమా. నేను రీమేక్స్ లో నటించను. అప్పటికే ఒకరు నటించిన క్యారెక్టర్ నేను చేసే ఎక్స్ పెక్టేషన్స్ వేరుగా ఉంటాయని చెప్పింది.
ఇక తాజాగా సాయి పల్లవి వదిలేసిన మరో సినిమా గురించి టాక్ బయటకు వచ్చింది. అదే లారెన్స్ హీరోగా నటిస్తున్న చంద్రముఖి 2. ఈ సినిమాలో కంగనా రనౌత్ క్యారెక్టర్ కోసం మొదట సాయి పల్లవినే మేకర్స్ సంప్రదించారట. అయితే అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను చేయలేనని చెప్పిందట సాయి పల్లవి. దాంతో కంగనా దగ్గరకు ఈ సినిమా వెళ్లింది. సాయి పల్లవి చంద్రముఖి 2 చేసుంటే ఖచ్చితంగా అది ఆమె కెరీర్ లో స్పెషల్ అయ్యేది అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఈ నెల 15న రిలీజ్ కు రెడీ అవుతోంది.