“డబుల్ ఇస్మార్ట్” అని రామ్ డబుల్ ఫీజు అడిగాడా?

రీసెంట్ టైమ్స్ లో పూరి జగన్నాథ్ హిట్ ఫిల్మ్ గా చెప్పుకోవాల్సింది ఇస్మార్ట్ శంకర్ గురించే. అందుకే తన గుడ్ విల్ రిపీట్ చేసేందుకు ఈ సినిమా సీక్వెల్ మీదే హోప్స్ పెట్టుకున్నాడు పూరి. రామ్ తో డబుల్ ఇస్మార్ట్ స్టార్ట్ చేశాడు. ఇందుకోసం హీరో రామ్ కు పూరి భారీగానే పారితోషికం ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. సాధారణంగా రామ్ ఓ సినిమా ఛార్జ్ చేసే దానికి డబుల్ ఈ చిత్రానికి చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

డబుల్ ఇస్మార్ట్ కోసం రామ్ కు దాదాపు 30 కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చేందుకు పూరి సిద్ధమయ్యాడని తెలుస్తోంది. ఇది రామ్ కు ఇచ్చే ఫీజుతో పోల్చితే దాదాపు రెట్టింపు. పైగా రామ్ గత రెండు సినిమాలు రెడ్, ది వారియర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆయన మార్కెట్ సహజంగానే తగ్గుతుంది. అయినా ఇంత చెల్లించారా అనేది అనుమానమే. ఒక వైపు పూరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే రామ్ 30 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తాడా అనేదీ సందేహమే. డబుల్ ఇస్మార్ట్ తో పాటు రామ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంధ మూవీలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానుంది.