“హరి హర..”కు పవన్ డేట్స్ ఇచ్చారా

హరి హర వీరమల్లు(Hari Hara veeramallu) సినిమా షూటింగ్ లో పవన్(Pawan Kalyan) త్వరలోనే పాల్గొంటాడనే టాక్ వినిపిస్తోంది. పవన్ పొలిటికల్ బిజీ వల్ల షూటింగ్ ఆగిపోయిన చిత్రాల్లో హరి హర వీరమల్లు ఒకటి. ఈ సినిమా షూటింగ్ లేట్ వల్ల దర్శకుడు క్రిష్(Director krish) ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఆ దర్శకత్వ బాధ్యతలు రవికృష్ణ చూస్తున్నారు.

ప్రస్తుతం పవన్ లేని సీన్స్ షూట్ చేస్తున్నారు. అయితే ఈ నెలాఖరుకు పవన్ కూడా హరి హర సెట్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్(Nidhi agarwal) హీరోయిన్ గా నటిస్తోంది. నోరా ఫతేహి, బాబీ డియోల్(Bobby deol), నర్గీస్ ఫక్రి లాంటి బాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పై ఏఎం రత్నం(Producer AM ratnam) నిర్మిస్తున్నారు.