జైలర్ లో బాలయ్య మిస్ అయ్యాడా..?

సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ సెన్సేషనల్ జైలర్. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్. ఇందులో రమ్యకృష్ణ, తమన్నా, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీష్రాఫ్ తదితరులు నటించారు. ఇలా భారీ తారాగణంతో.. భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన జైలర్ ఈ నెల 10న థియేటర్లో రిలీజైంది. గత కొంత కాలంగా రజినీకాంత్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు. బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడుతున్నాయి. అందుకనే.. జైలర్ సినిమా పై రజినీ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా మేకర్స్ కూడా జైలర్ ఎంత వరకు ఆకట్టుకుంటుందో అని ఆసక్తిగా ఎదురు చూశారు.

ఆఖరికి థియేటర్లోకి వచ్చిన జైలర్ ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉంది. సెకండాఫ్ ఫరవాలేదు. టోటల్ గా జైలర్ హిట్ సినిమా అనే టాక్ వచ్చింది. ఈ టాక్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఈ సినిమా రిలీజైన అన్ని ఏరియాల్లో ఇదే రిపోర్ట్. రోజురోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో జైలర్ కు థియేటర్లో పెంచుతున్నారంటే.. కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ కోసం బాలయ్యను అనుకున్నాడట డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కానీ.. బాలయ్యను కాంటాక్ట్ చేయలేదట.

ఈ సినిమాని మల్టీస్టారర్ గా చేయకూడదు అనుకున్నాడట. అందుకనే బాలయ్యను సంప్రదించలేదేమో. అయితే.. బాలయ్యతో భవిష్యత్ లో సినిమా చేయచ్చేమో అని కూడా నెల్సన్ ఓ ఇంటర్ వ్యూలో చెప్పడం ఆసక్తిగా మారింది. మరి.. భవిష్యత్ లో బాలయ్య, నెల్సన్ కాంబో సెట్ అవుతుందేమో చూడాలి.