“డ్రింకర్ సాయి”తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న యువ హీరో ధర్మ

ఇండస్ట్రీలో వారసులే కాదు ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండే స్టార్స్ అయిన యంగ్ హీరోస్ ఎంతోమంది ఉన్నారు. అలాంటి హీరోలను ఇన్సిపిరేషన్ గా తీసుకుని డ్రింకర్ సాయి మూవీతో ఎంట్రీ ఇచ్చారు ధర్మ. ఈ యంగ్ హీరో డ్రింకర్ సాయి సినిమాలో తన ఓవరాల్ పర్ ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. డ్యాన్సులు, ఫైట్స్, ఫన్ టైమింగ్, ఎమోషన్..ఇలా అన్నింట్లో మెప్పించాడు. ఇండస్ట్రీకి మరో ప్రామిసింగ్ యంగ్ హీరో అవుతాడనే పేరు తెచ్చుకున్నాడు ధర్మ.

డ్రింకర్ సాయి సినిమా గత నెల 27న థియేటర్స్ లోకి వచ్చి..మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమాను దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి రూపొందించారు. ఐశ్వర్య శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి. ప్రస్తుతం డ్రింకర్ సాయి సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో రన్ అవుతోంది.