దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్ రూపకల్పనకు సన్నాహాలు జరుగుతున్నాయి. వెయ్యికి పైగా సినిమాలకు సంగీతాన్ని అందించిన ఇళయరాజా అంటే ప్రపంచ సినీ సంగీత ప్రియులకు ఎంతో అభిమానం. ఆయన బయోపిక్ అంటే అందరిలో ఆసక్తి కలగడం ఖాయం. ఇప్పుడు కోలీవుడ్ లో ఈ సినిమా న్యూస్ టాపిక్ అయ్యింది.
ఇళయరాజా బయోపిక్ లో హీరో ధనుష్ నటిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇళయరాజాకు పెద్ద అభిమాని అయిన ధనుష్ ..ఆయన జీవిత కథలో నటించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారట. అందుకే ఈ ప్రాజెక్ట్ ను ధనుష్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. పేదరికం నుంచి వచ్చిన ఓ సాధారణ యువకుడు సినీ సంగీత ప్రపంచంలో మరెవరికీ సాధ్యం కాని చరిత్రను ఎలా సృష్టించాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు.