కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న డెవిల్ సినిమా నుంచి డైరెక్టర్ నవీన్ మేడారంను తొలగించడం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ ముందు ఇలా దర్శకుడిని తొలగించడం ఈ మధ్య కాలంలో జరగలేదు. అతనితో విభేదాలు ఉన్నా..టైటిల్స్ డైరెక్టర్ పేరు తీసేయడం దారుణం అంటూ నిర్మాత అభిషేక్ నామాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు మూడేళ్లుగా డెవిల్ సినిమా కోసం పనిచేస్తున్నాడు డైరెక్టర్ నవీన్ మేడారం.
డెవిల్ సినిమా నవంబర్ 24న రిలీజ్ కానుంది. తాజాగా పాటల ప్రమోషన్ స్టార్ట్ చేశారు. సినిమా కొత్త పోస్టర్ లో ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గా అభిషేక్ నామా తన పేరును వేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. డెవిల్ కోసం ఇన్నేళ్లు కష్టపడిన నవీన్ మేడారం తనకు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు. వినాశకాలే విపరీత బుద్ధి అంటూ ఇన్ స్టాలో బ్లాక్ పేజీ పోస్ట్ చేశారు.
బ్రిటీష్ కాలం నాటి ఏజెంట్ కథతో ఈ సినిమాను రూపొందించారు నవీన్ మేడారం. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో అభిషేక్ నామా నిర్మించారు.