“దేవర” రిలీజ్ ట్రైలర్ – హైప్ కు తగిన కిక్ లేదు

ఎన్టీఆర్(NTR) హీరోగా నటిస్తున్న దేవర(Devara) సినిమా థియేటర్స్ లో ఎలా ఉంటుందో గానీ ఇప్పటిదాకా రిలీజ్ చేస్తున్న కంటెంట్ ఏదీ సంతృప్తినిచ్చేలా ఉండటం లేదు. గ్లింప్స్, సాంగ్స్ (చుట్టమల్లే తప్ప), ట్రైలర్ అన్నీ సినిమా మీదున్న హైప్ కు తగిన కిక్ ఇవ్వడం లేదు. ఈ సినిమా ఈ నెల 27న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ రోజు రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. దేవర రిలీజ్ ట్రైలర్(Devara Release trailer) ఎలా ఉందో చూస్తే

సముద్రాన్ని కాపాడుతూ దేవర(ఎన్టీఆర్) సముద్రంపైనే ఉంటాడు. ఆయన కొడుకు(ఎన్టీఆర్) ఊరిలో పెరుగుతుంటాడు. ఈ యువకుడు తనలో బలం ఉన్నా అది గుర్తించక భయపడుతుంటాడు. ఓ సందర్భంలో భారీ ఫైట్ చేసి దేవరకు తాను సరైన వారసుడు అనిపించుకుంటాడు. ఎన్టీఆర్ వెంటపడే జాన్వీ ఈ ఫైట్ చూసి హ్యాపీగా ఫీలవుతుంది. విలన్ సైఫ్, దేవర (ఎన్టీఆర్) ఒకప్పుడు ఫ్రెండ్స్ అయితే కొన్ని విషయాల్లో డిఫరెన్సెస్ వచ్చి విడిపోతారు. సముద్రాన్ని దోపిడీ చేసేందుకు సైఫ్, దాన్ని అడ్డుకుని సముద్రాన్ని కాపాడే బాధ్యత దేవర తీసుకుంటాడని ఈ రిలీజ్ ట్రైలర్ తో తెలుస్తోంది. దేవుడి కథలు వింటే భయం పోతుంది. దేవర కథ వింటే భయం పుడుతుంది, దేవర అడిగితే చెప్పినట్లే అనే డైలాగ్స్ ఈ రిలీజ్ ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరోసారి తేలిపోయింది. ఈ రిలీజ్ ట్రైలర్ తో దేవర కథ మరింతగా రివీల్ చేశారు దర్శకుడు కొరటాల శివ.